మన తెలుగునాట మంచి క్రేజ్ ను సంతరించుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతీ వీకెండ్ లోనూ ఎలిమినేషన్స్ ఉన్నట్టుగానే ఈ వీకెండ్ లో కూడా ఒక ఎలిమినేషన్ ఉంది.
ఆ కంటెస్టెంట్ కూడా మెహబూబ్ అనే విషయం తేలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇటీవలే ఎలిమినేట్ కాబడిన ఓ కంటెస్టెంట్ మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టనున్నాడని తెలుస్తుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయినే.
ఆ మధ్య కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో పెద్ద రచ్చే నడిచింది. మోనాల్ ను ఉంచి అతన్ని ఎలిమినేట్ చెయ్యడం పట్ల షో వీక్షకుల్లో అభ్యంతరకరం వ్యక్తం అయ్యింది. కానీ ఇప్పుడు ఇదే కంటెస్టెంట్ తిరిగి వచ్చే సూచనలు ఉన్నట్టుగా టాక్. మరి ఈ కంటెస్టెంట్ నిజంగానే వస్తున్నాడా లేదా అన్నది చూడాలి.