తెలుగు స్మాల్ స్క్రీన్ పై కొద్ది కాలమే టెలికాస్ట్ అయినా ఆ కొన్ని రోజులు కూడా ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ను తెలుగు ఆడియెన్స్ కు ఇచ్చి వెళ్లిపోయే గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్లోకి అడుగు పెట్టిన ఈ గ్రాండ్ రియాలిటీ షో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ షోలో ఇప్పుడు టాప్ లో ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అన్నది ఆడియెన్స్ కు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే అలాంటి కంటెస్టెంట్స్ లో అభిజీత్ కూడా ఒకడు. ఇటీవలే నామినేషన్స్ లో అభిజీత్ పై పలువురు ఒక కామన్ రిమార్క్ నే పెట్టారు ఫిజికల్ టాస్కులు చెయ్యడం లేదని చెయ్యకుండా తప్పించుకుంటున్నాడని అన్నారు.
అలాగే నెటిజన్స్ కూడా చాలా మందే అభిజీత్ పై రైజ్ చేసారు. కానీ నిన్నటి ఎపిసోడ్ తో మాత్రం వారందరికీ అభిజీత్ సమాధానం ఇచ్చాడని అతనిని ఇష్టపడే వారు అంటున్నారు. ఇన్నాళ్లు ఆ ఒక రిమార్క్ తో అభిజీత్ పై చాలానే విమర్శలు వచ్చాయి. అయితే ఆ మధ్య అభిజీత్ తల్లి అతని భుజానికి ఒక ఫ్రాక్చర్ కావడం వల్ల అలాంటి టాస్కులు ఇబ్బందికరంగా ఉంటాయని తెలిపిన సంగతి తెలిసిందే.