తక్కువ కాలంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్స్ లో విష్ణు ప్రియ ఒకరు. ఈటీవీలో ప్రసారం అయ్యే పోవే పోరా, ఢీ జోడీ వంటి షోల ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే ఈ యాంకర్ యంగ్ హీరో అఖిల్ కి పెద్ద ఫ్యాన్ అట. ఆయనంటే ఎంత అభిమానం అంటే…అవకాశం ఇస్తే పెళ్లి కూడా చేసుకుంటానని చెవుతుందట. ఈ విషయాన్ని విష్ణు ప్రియ ఫ్రెండ్ అయిన పాప్యులర్ యాంకర్ శ్రీముఖి తాజా ఇంటర్వ్యూ లో బయటపెట్టారు.
క్యూట్ చార్మింగ్ హీరో అయిన అఖిల్ అక్కినేని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. కాగా అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించడం విశేషం.