అప్పుడు వాళ్ళిద్దరూ ఇప్పుడు మేమిద్దరమూ.!


గతంలో తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రాధకి ఇద్దరు కుమార్తెలు, వారిలో ఒకరైన కార్తీక ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. ఇప్పుడు రాధ రెండవ కుమార్తె తులసి తెరపై కనిపించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం తులసి సౌత్ ఇండియన్ దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కడల్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తులసి ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల చేసారు. తులసి లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత ఓ ప్రముఖ డైలీ తెలుగు పేపర్ వారితో తులసి మాడ్లాడింది.

‘భారతీరాజ డైరెక్షన్లో కార్తీక్ అంకుల్, మా అమ్మ రాధ కలిసి ‘అలైగల్ ఓయ్ వదిల్లై’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇప్పుడు వారిద్దరి వారసులమైన మేమిద్దరం(గౌతమ్ కార్తీక్, తులసి) మణిరత్నం గారి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానుండడం ఎంతో షాకింగ్ గా ఉంది. అలాగే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అందుకే నేను చేయబోయే సినిమాల్లో నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని తెలుగు, తమిళం నేర్చుకుంటున్నానని’ అంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 17న జరగనుంది.

Exit mobile version