ప్రమోషన్స్ కూడా చేసుంటే ‘ఓజి’ మేనియా ఇంకో లెవెల్లో ఉండేదా? గోల్డెన్ ఛాన్స్ మిస్

ప్రమోషన్స్ కూడా చేసుంటే ‘ఓజి’ మేనియా ఇంకో లెవెల్లో ఉండేదా? గోల్డెన్ ఛాన్స్ మిస్

Published on Sep 24, 2025 9:00 AM IST

OG

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. ఇక ఊహించని హైప్ నడుమ నేడే థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా తాలూకా హైప్ ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. కానీ ఈ హైప్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ కనుక చేసి ఉంటే దాని తాలూకా ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది అని చెప్పవచ్చు.

మెయిన్ గా హిందీలో ఇమ్రాన్ హష్మీ, తమిళ్ నుంచి అర్జున్ దాస్ లాంటి వాళ్ళని పట్టుకొని కూడా అక్కడ మినిమమ్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ కూడా చేయలేదు. ఇవి కనీసం చేసుకున్నా కూడా తెలుగు మినహా మిగతా ఏరియాల్లో డెఫినెట్ గా వర్క్ అయ్యి ఉండేది. అయినప్పటికీ ఓజి రికార్డు ఓపెనింగ్స్ తెరవడం ఖాయం అనే మాట మాత్రం ఇపుడు గట్టిగా వినిపిస్తుంది. సో ఓజి ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

తాజా వార్తలు