బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్స్ ఆల్రెడీ సేఫ్ అట.!

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎలాగో చివరకు వచ్చేస్తుంది. ఇక ఈ పదకొండవ వారంలో ఎలిమినేషన్స్ కు గాను నామినేషన్ ప్రక్రియ కూడా మంచి గరం గరంగానే జరిగింది. కానీ తర్వాత మాత్రం ఫ్యామిలీ టచ్ తో ఈ రెండు రోజులు పరిస్థితులు మార్చేశారు.

అయితే నామినేషన్స్ లో ఉన్నటువంటి వారిలో మోనాల్ గజ్జర్ మరియు లాస్యా కాస్త డేంజర్ జోన్ లో ఉన్నారని గాసిప్స్ వినిపించిన క్రమంలోనే ఇప్పుడు ఆల్రెడి సేఫ్ గా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అన్నది తెలుస్తుంది. వారే టాప్ 5 లో ఉన్నటువంటి అభిజీత్ మరియు షోయెల్. వీరిద్దరి ఈ వారాంతం జరగబోయే ఎలిమినేషన్ నుంచి సేఫ్ గా ఉన్నారట. ఇక మిగతా టెన్షన్ అంతా మిగిలిన వారిలోనే అని చెప్పాలి. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Exit mobile version