“రాధే శ్యామ్”లో ఈ అంశాలు ఆశించొద్దు – ప్రభాస్ మాటే.!

“రాధే శ్యామ్”లో ఈ అంశాలు ఆశించొద్దు – ప్రభాస్ మాటే.!

Published on Nov 6, 2020 10:25 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్” పై మరిన్ని అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మోషన్ పోస్టర్ మరియు ఇటలీ షెడ్యూల్ మొదలు పెట్టిన దగ్గర నుంచి మరిన్ని అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. అయితే ఇటలీ లోని ప్రభాస్ నుంచి చాలానే కొత్త విషయాలు తెలిసాయి.

ఇప్పుడు అందులో భాగంగానే ప్రభాస్ అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా “రాధే శ్యామ్” సినిమా ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం మొత్తం క్లీన్ లవ్ స్టోరీతో నిండి ఉంటుందని తెలిపారు. అలాగే ఈ చిత్రంలో కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే ఉంటుందని తెలిపారు.

దీనితో ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఇలాంటి భారీ చిత్రంలో అలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు ఆశించకూడదని నేరుగా ప్రభాసే చెప్పినట్టు అయ్యింది. ఇప్పటికే ప్రభాస్ కటౌట్ లో భారీ యాక్షన్ సీన్స్ తో ఇండియన్ ఆడియెన్స్ అలా ఫిక్స్ అయ్యిపోయారు. కానీ అలాంటిది రాధే శ్యామ్ లో అలాంటి హంగులు తక్కువే ఉండటం కాస్త బాధాకరమైన అంశమే అని చెప్పాలి. మరి ఆద్యంతం కనిపించే ఈ వింటేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు