నితిన్ పెళ్ళికి పవన్ తో పాటు వీరు కూడా.?

నితిన్ పెళ్ళికి పవన్ తో పాటు వీరు కూడా.?

Published on Jul 22, 2020 9:07 PM IST

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఎట్టకేలకు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. తన ఫియాన్సీ షాలిని కందుకూరిని నితిన్ హైదరాబాద్ లోనే ఈ జూలై 26 న వివాహం చేసుకోనున్నాడు. అయితే ఈ వివాహానికి గాను నితిన్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులను మరియు సినీ పరిశ్రమ నుంచి అగ్రులను ఆహ్వానించాడు. వారిలో తన ఆల్ టైం అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.

అయితే నితిన్ వివాహానికి పవన్ రాక ఇంకా ఖరారు అయ్యిందో లేదో కానీ ఒకవేళ పవన్ కనుక హాజరైనట్టయితే పవన్ తో పాటుగా పవన్ స్నేహితుడు మరియు దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు కానీ ఈ మూమెంట్ కోసం వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు