“ఆహా”లో ఈ డిజిటల్ ప్రీమియర్స్ ట్రీట్ ఇస్తాయట!

“ఆహా”లో ఈ డిజిటల్ ప్రీమియర్స్ ట్రీట్ ఇస్తాయట!

Published on May 14, 2020 12:00 AM IST

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ చాలానే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఇంకా ఎన్నో ఓటిటి యాప్స్ మన తెలుగులో కూడా సక్సెస్ అయ్యాయి. కానీ వీటన్నిటికీ బ్రేక్ ఇస్తూ మొట్టమొదటి సారిగా మన తెలుగు నుంచే వచ్చిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా”. తెలుగు పరిశ్రమ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ యాప్ ప్రారంభంలోనే మంచి ఆదరణను రాబట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ యాప్ నుంచి మరింత ట్రీట్ తమ వీక్షకులకు అందబోతున్నట్టుగా వారు తెలుపుతున్నారు.

ఇటీవలే “కనులు కనులను దోచాయంటే” డిజిటల్ ప్రీమియర్ తో ఆకట్టుకున్న ఆహా లో ఇప్పుడు నాచురల్ స్టార్ నాని నటించిన “కృష్ణార్జున యుద్ధం” సినిమా కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాతో పాటుగా శ్రీవిష్ణు మరియు నివేతా పేతురాజ్ జంటగా నటించిన తాజా చిత్రం “మెంటల్ మదిలో” మరియు హీరో నవదీప్ ను మెయిన్ లీడ్ లో చేసిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “రన్” లు మంచి ట్రీట్ ఇస్తాయని వారు తెలుపుతున్నారు. మెంటల్ మదిలో ఈ మే 15న ప్రీమియర్ కు వస్తుండగా రన్ 29న డిజిటల్ ప్రీమియర్ గా ఆహా లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ కానుంది.

తాజా వార్తలు