అరడజను సినిమాలు విడుదలకు సిద్ధం

అరడజను సినిమాలు విడుదలకు సిద్ధం

Published on Feb 5, 2020 8:36 PM IST

వచ్చే వారం అర డజను సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో శర్వా నంద్-సమంత జంటగా వస్తున్న జాను మాత్రమే పెద్ద సినిమా. మిగతా ఐదు చిత్రాలలో ఒకటి డబ్బింగ్ మూవీ కాగా నాలుగు టాలీవుడ్ కి చెందిన చిన్న చిత్రాలు. 96 తెలుగు రీమేక్ గా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన జాను చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒరిగినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఇక మ్యూజిక్ అందించిన గోవింద్ వసంత్ కూడా 96కి పనిచేయడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచివేశాయి.

వీటితో పాటు జబర్థస్త్ స్టార్స్ అయిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి నటించిన మూవీ 3 మంకీస్. కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇది కూడా ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది. ఇక తమిళ్ డబ్బింగ్ మూవీ స్టాలిన్ తో పాటు, డిగ్రీ కాలేజ్, హీరో హీరోయిన్, సవారి చిత్రాలు విడుదల అవుతున్నాయి. సంక్రాంతి చిత్రాల జోరు బాక్సాఫీస్ వద్ద నెమ్మదించడంతో చిన్న చిత్రాలు విడుదలకు వరుస కట్టాయి.

తాజా వార్తలు