వాటిలో చిన్నవి, పెద్దవి ఉండవంటున్న అనుష్క


ప్రస్తుతం మన ప్రేక్షకులకి ఇండస్ట్రీలో ఉండే వారికి పాత్రని బట్టి కష్టం ఉంటుంది చిన్న పాత్రయితే అసలు కష్ట పడాల్సిన అవసరం అంతగా ఉండదు అనే భావన ఉంది. కానీ యోగా బ్యూటీ అనుష్క మాత్రం ఈ విషయంపై మరోలా స్పందించింది. ‘ ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే బేధం లేదు. ఏ సినిమా కోసమైనా ఆ టీం అంతా ఎంతో కష్టపడి పని చేస్తారు, సినిమాలో విషయం ఉంటే విజయం సాదించి అదే పెద్ద సినిమా అవుతుంది. అదే విధంగా చిన్న పాత్రలు, పెద్ద పాత్రలు అనే తేడా ఉండవు, చిన్న పాత్ర చేసినా సినిమా హిట్ అయితే దానికి మంచి పేరు వస్తుంది. అలాగే నేను ఒక్క ‘అరుంధతి’ సినిమాకే ఎక్కువ కష్టపడి ఉంటాను అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ నేను నా మొదటి సినిమా ‘సూపర్’ నుంచి ఇప్పటి వరకూ ప్రతి సినిమాకి అంతే కష్టపడి అంకిత భావంతో పనిచేస్తానని’ అనుష్క అన్నారు.

ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క తెలుగులో నాగార్జున సరసన నటించిన ‘డమరుకం’ వచ్చే వారంలో విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రభాస్ సరసన ‘వారధి'(వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తోంది.

Exit mobile version