టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే మాస్ ఎంటర్టైనర్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం కూడా పలువురు టాప్ దర్శకులతో సినిమాలు చేయనున్నారు. అయితే మహేష్ కెరీర్ లో జయాపజయాలకు సంబంధం లేకుండా క్లీన్ ఎంటర్టైనింగ్ సినిమాలను అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటే వారికి ఎప్పుడు అదొక స్పెషలే.
అందుకే ఈ కాంబో ఒక చిత్రం కూడా సెట్ అయితే బాగుంటుంది అని వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్య ఈ కాంబో సెట్ అయ్యిందనే గాసిప్స్ వినిపించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ ఇద్దరి కాంబో నుంచి ఒక సినిమా రావడం కనుచూపు మేరలో కనిపించేలా లేదని సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే ఈ ఇద్దరూ చేస్తున్న ప్రాజెక్టుల నిమిత్తం ఒక పర్టిక్యులర్ సమయానికి అయితే ఖాళీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆ ప్రకారం ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ లేనట్టే అని చెప్పాలి.