ఈ రోజు ఉదయం నుంచి కీర్తిశేషులైన లిబియా డిక్టేటర్ గడాఫీ గెటప్ లో ఉండే ఎం.ఎస్ నారాయణ ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలో ఎం.ఎస్ నారాయణ గడాఫీ గెటప్‌లో సూపర్బ్ గా ఉన్నారు. ఈ ఫోటో మార్ఫింగ్ చేసిందని దానికి సాక్షాదారమైన ఫోటోలతో కొంతమంది కౌంటర్ ఇవ్వగా. అసలు ఇంతకీ విషయం ఏమిటో తెలుసుకుందామని మేము ఆరా తీస్తే మాకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది.
సందీప్ కిషన్ మరియు రేగిన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘రొటీన్ లవ్ స్టొరీ’ చిత్రం లోనిది ఈ ఫోటో. కానీ ఈ ఫోటో మార్ఫింగ్ చేసినదే. ఏంటి గందరగోళంగా ఉందా? అయితే వినండి ఈ చిత్రంలో ఎం.ఎస్ నారాయణ గడాఫీకి వీరాభిమాని పాత్రలో కనిపిస్తాడు, అలాగే అతని కాలేజీ రోజుల్లో అదే విధంగా డ్రస్స్ వేసుకుని కాలేజ్ కి వెళ్తుంటారు. ఆ టైములో చూసిన వాళ్లకి ప్రత్యేకంగా ఉండాలని ఇలా మార్ఫ్ చేసిన ఫోటోని తన రూం లో పెట్టుకుంటాడనే వార్త తెలిసింది. ఈ ఫోటోని కామెడీ కోసం మాత్రమే మార్ఫ్ చేసారు, ఇందులో మరే ఇతర ఉద్దేశం లేదు. ఇదేనండి ఎం.ఎస్ నారాయణ మార్ఫింగ్ గడాఫీ ఫోటోకి వెనుక ఉన్న అసలైన కథ.