వీళ్ళే సౌత్ ఇండియన్ ఎక్స్ పాండబుల్స్.!!

వీళ్ళే సౌత్ ఇండియన్ ఎక్స్ పాండబుల్స్.!!

Published on Aug 26, 2012 6:08 PM IST


మీకు అందించిన పైన ఫోటోని ఒకసారి చూడండి ఈ ఫోటోని ఎవరో ఒక సౌత్ ఇండియన్ సినీ లవర్ ఫోటోషాప్ లో క్రియేట్ చేసి ఇంటర్నెట్లో విడుదల చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ‘ఎక్స్ పాండబుల్స్ 2’ చిత్ర పోస్టర్లో సౌత్ ఇండియన్ హీరోల ఫోటోలను మార్ఫింగ్ చేసారు.

ఈ ఫోటోలో రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ మరియు జూ. ఎన్.టి ఆర్ లను చూడవచ్చు. ఇప్పటి వరకూ ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పటికీ రాదు అని తెలిసినా ఈ ఫోటో చూస్తే అభిమానులకు ఒక్కసారిగా రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి. బహుశా, ఇలాంటి మల్టీ స్టారర్ చిత్రం భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చే అవకాశం లేదు కనుక ఈ ఫోటోని చూసి ఆనందించడి.

తాజా వార్తలు