‘ది రాజా సాబ్’ ఆగేది లేదు.. అఫీషియల్ క్లారిటీ

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే హీరోయిన్ రిద్ది కుమార్ లతో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ హారర్ ఫాంటసీ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా చుట్టూతా ఈ మధ్య వాయిదా పడుతుంది అంటూ పలు రూమర్స్ వైరల్ అయ్యాయి. సినిమా జనవరిలో కూడా రాదని టాక్ వచ్చింది.

కానీ దీనిపై నేరుగా మేకర్స్ పీపుల్ మీడియా సంస్థ అఫీషియల్ స్టేట్మెంట్ అందించారు. తాము వరల్డ్ క్లాస్ విజువల్స్ అండ్ వరల్డ్ క్లాస్ రిలీజ్ చేసే పనిలో ఉన్నామని ప్రస్తుతం ఓ టీం అంతా విజువల్ ఎఫెక్టుల పనుల్లో నిమగ్నమయ్యారు అని రాజా సాబ్ అనుకున్న తేదీకి వచ్చి తీరుతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమాపై వస్తున్న ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదనే చెప్పి తీరాలి.

Exit mobile version