ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : అక్టోబర్ 12, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : రావణ్ రెడ్డి నిట్టూరు, శ్రీనివాస్ రామిరెడ్డి, గడ్డం శ్రీనివాస్, రమాదేవి తదితరులు
దర్శకుడు : కొత్తపల్లి సురేష్
నిర్మాత : త్తపల్లి సురేష్
సంగీత దర్శకుడు : విశాల్ భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్ : అక్షయ్ వాసూరి
ఎడిటర్ : రిషికేశ్వర్ యోగి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన కథా సుధ తాలూకా కొత్త లఘు చిత్రమే “ది మాస్క్”. మరి ఈ చిత్రం ఏమేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఇద్దరు యువకులు నివాస్ (రావణ్ రెడ్డి నిట్టూరు) అలాగే వికాస్ (శ్రీనివాస్ రామిరెడ్డి) ఒకరు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని మరొకరు తాగి పోలీసులకి దొరికి లైఫ్ ని ప్రశ్నార్ధకం చేసుకుంటారు. ఈ క్రమంలో నివాస్ ఓ రాత్రి ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు లోపలికి వెళ్తాడు. అలా వెళ్లిన తర్వాత కొన్ని ఊహించని ఘటనలతో ఓ మాస్క్ మ్యాన్ కూడా ఆ ఇంట్లో తనకి కనిపిస్తాడు. అదే సమయంలో ఓ పెద్దావిడ మర్డర్ చేయబడి ఉంటుంది. మరి ఆ మాస్క్ మ్యాన్ ఎవరు? ఆవిడని మర్డర్ చేసింది ఎవరు? ఈ క్లిష్ట పరిస్థితి నుంచి నివాస్ తప్పించుకున్నాడా లేదా? అసలు చివరికి ఏమైంది అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రం ఒకింత థ్రిల్ మ్యానర్ లో ట్రై చేసారని చెప్పాలి. లైన్ తగ్గట్టుగా క్రియేట్ చేసుకున్న సెటప్ అంతా డీసెంట్ గా ఉంది. ఒకటీ రెండు చోట్ల సౌండింగ్, సస్పెన్స్, చిన్నగా థ్రిల్ అంశాలు ఇంకా ట్విస్ట్ లు డీసెంట్ గా ఉన్నాయి.
రావణ్ రెడ్డి మంచి పెర్ఫామెన్స్ అందించాడు. తనలోని సస్పెన్స్ సీన్స్ లో భయం, ఇంకా క్లైమాక్స్ లో ఫన్ టోన్ లో బాగా చేసాడు. అంతే కాకుండా శ్రీనివాస్ రామిరెడ్డి కూడా తన రోల్ లో బాగా చేసాడు. అలాగే లాస్ట్ లో చిన్న ఫన్ మూమెంట్స్ బాగున్నాయి. ఇంకా సీనియర్ నటుడు గడ్డం శ్రీనివాస్ తన రోల్ కి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
ఇందులో బిగ్గెస్ట్ మైనస్ ఏదన్నా ఉంది అంటే ఆ స్లో కథనమే అని చెప్పాలి. ఏదో సాలిడ్ థ్రిల్ కలిగించేద్దాం అనుకుని డిజైన్ చేసిన సీన్స్ చాలా బోరింగ్ గా స్లోగా సాగుతూ ఉంటాయి. కేవలం 35 నిమిషాల ఈ షార్ట్ ఫిలిం చూస్తుంటే గంటసేపు సాగదీసినట్టుగా వెళుతూనే ఉంటుంది.
ఇక ఇందులో నడిచే కథనం కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకున్నారు కానీ ఈ స్లో నరేషన్ మూలాన అది వర్కౌట్ అయ్యినట్టుగా అనిపించదు. అంతే కాకుండా నివాస్ ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు పార్లల్ గా మరో స్టోరీ కూడా తర్వాత చూపించారు కానీ ఆ సెటప్ అంతా చాలా సిల్లీగా అనిపిస్తుంది.
ఎంత లాజిక్ గా ఆలోచించాల్సి వచ్చినా ఆ కొంత సేపట్లోనే చాలానే జరిగిపోతాయి. ఇవన్నీ ఒకింత ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. వీటితో ఈ చిత్రం మాత్రం నిరాశే మిగులుస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో టెక్నీకల్ టీం వర్క్ మాత్రం బాగుందని చెప్పొచ్చు. ఎప్పుడో 2000 నోట్లు రద్దు కాకముందు తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ముఖ్యంగా సౌండింగ్, కెమెరా వర్క్స్ ఇందులో బాగున్నాయి. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఇక దర్శకుడు కొత్తపల్లి సురేష్ విషయానికి వస్తే.. తన వర్క్ డిజప్పాయింటింగ్ గానే ఉందని చెప్పక తప్పదు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ని ట్రై చేద్దామనికున్నట్టు అనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలా బోరింగ్ అండ్ సాగదీతగా ఇందులో కథనం సాగుతుంది. పైగా ఆ సిల్లీ మూమెంట్స్ ఫ్లోలో ఇంకా దెబ్బ తీసినట్టు అనిపిస్తాయి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘ది మాస్క్’ అనే లఘు చిత్రం ఒక ఇంప్రెస్ చేయలేని బోరింగ్ థ్రిల్లర్ ఎపిసోడ్ అని చెప్పక తప్పదు. ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకునే యత్నం ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ గా ఆ సాగదీతని ఎంత థ్రిల్లర్ లవర్స్ అయినా ఎంజాయ్ చేయలేరు. సో ఈ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team