వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ నవంబర్ 7న విడుదలకు సిద్ధమైంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు.
తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తిరువీర్ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల ప్రేమ వల్లే విలన్‌గా మొదలైన నా ప్రయాణం ఇప్పుడు కో-ప్రొడ్యూసర్ దాకా వచ్చింది. ఈ చిత్ర ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది.” అని అన్నారు.
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “గత ఏడాది ఇదే తేదీన షూట్ మొదలుపెట్టాం. ఇప్పుడు రిలీజ్ చేయడం స్పెషల్. టీం అంతా ఫ్యామిలీలా పని చేసింది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ.. “ఈ కథే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. రాహుల్, తిరువీర్ భుజాన వేసుకొని సినిమా పూర్తి చేశారు. ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ.. “హేమ పాత్ర నాకు చాలా స్పెషల్. రాహుల్ గారు, తిరువీర్ గారికి థాంక్స్. ప్రీమియర్లకు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది” అని అన్నారు.


