ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం ఎలాంటి వసూళ్లు రాబట్టి అదరగొడుతుందో అందరికీ తెలిసిందే. ఇలా పవన్ కెరీర్ లోనే భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. పవన్ ని మాస్ అవతార్ లో దర్శకుడు హరీష్ శంకర్ మరింత ఎనర్జిటిక్ గా ప్రెజెంట్ చేస్తుండగా దీనిపై కూడా మంచి హైప్ ఉంది.
ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి సాలిడ్ క్లారిటీ ఈ దీపావళికి రానుంది అని తెలుస్తుంది. దీని ప్రకారం ఈ దీపావళి కానుకగా మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాగో సినిమా వచ్చే ఏడాదికే లాక్ చేస్తారు. అది కూడా ప్రథమార్ధంలోనే వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఆ డేట్ ఏంటి అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.