టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, రాజమౌళికి సంబంధించి ఓ సెంటిమెంట్‌ను మహేష్ బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రాజమౌళి సినిమాల్లో నటించే హీరోలకు షూటింగ్ సమయంలో గాయాలు కావడం మనం చూశాం. బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సమయంలో ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు. దీంతో ఇప్పుడు వారణాసి చిత్రంలో మహేష్ బాబు కూడా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయనుండటంతో గాయాల సెంటిమెంట్‌ను ఆయన బ్రేక్ చేస్తాడేమో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మహేష్ విషయంలో జక్కన్న కాస్త ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటాడనే చర్చ కూడా సాగుతోంది.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
