అదే నిజమైన ప్రేమ – సమంత

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్‌స్టా లో పోస్ట్‌ చేసిన మెసేజ్ ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఇంతకీ, సమంత తన పోస్ట్ లో ఏం రాసుకొచ్చింది అంటే.. ‘నేను, నా మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆ చర్చ నన్ను ఆలోచింపజేసింది. ముప్పై ఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే తీరు మారుతుంది. ప్రతిదీ తగ్గుముఖం పడుతుంది. మీ అందం, మీ మెరుపు అన్నిట్లో మార్పు వస్తుంది. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలంటే ఇరవైలలోనే ఏదైనా చేయాలి. లేకపోతే, మీకు ప్రతి దానికి సమయం లేదు అనిపిస్తోంది’ అని సమంత తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

సమంత ఇంకా తన పోస్ట్ లో రాసుకొస్తూ.. ‘నేను ఇరవైలలో ఉన్నప్పుడు చాలా గందరగోళంగా ఉండేదాన్ని. ముఖ్యంగా నాకు అంటూ మంచి గుర్తింపు కావాలని ఆరాటపడేదాన్ని. ఆ సమయంలో నన్ను నేను ఎంత కోల్పోయాను. ఆ సమయంలో, ప్రేమ గురించి నాకెవరూ చెప్పలేదు. నిజమైన ప్రేమ మనలోనే ఉంటుందని అది బయట నుంచి రాదనే విషయాన్ని నాకు అప్పుడు ఎవరూ చెప్పలేదు. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని తర్వాత అర్థం చేసుకున్నా’ అని సమంత తెలిపింది. ఉన్నట్టు ఉండి సమంత ఎందుకు ఈ పోస్ట్ పెట్టింది అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version