ఒక రోజు… ముగ్గురి తెలివితేటలు… గన్స్, గోల్డ్ కోసం జరిగే వేటతో ‘బా బా బ్లాక్ షీప్’ అనే క్రైమ్ కామెడీ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దోనెపూడి చక్రపాణి సమర్పణలో, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనెపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దసరా సందర్భంగా కథ, కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ విడుదలైంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా విడుదలైన ఈ పోస్టర్లో గన్స్, గోల్డ్ చుట్టూ సాగే రసవత్తరమైన ప్రయాణం, క్రైమ్‌తో కలిసిన కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సూచిస్తోంది. ముగ్గురి జీవితాల్లో ఒకే రోజులో జరిగే ఊహించని సంఘటనలు, వాటి వల్ల పుట్టే వినోదం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి.
త్వరలోనే చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. మరిన్ని అప్డేట్స్ను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.