ఈ విషయంలో అజిత్ సినిమాని దాటి అదరగొట్టిన “తండేల్”

ఈ ఫిబ్రవరిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విడా ముయర్చి అలాగే మన తెలుగు నుంచి యంగ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమా తండేల్ ఒక రోజు వ్యవధిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో లేటెస్ట్ గా చైతు సినిమా అజిత్ సినిమాని బుకింగ్స్ పరంగా క్రాస్ చేయడం విశేషం.

మరి తండేల్ సినిమాకి నిన్న శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 2 లక్షల 20 వేలకి పైగా టికెట్స్ బుక్ అయితే అజిత్ లాంటి స్టార్ సినిమాకి షాకింగ్ గా కేవలం లక్ష 50 వేలకి పైగా మాత్రమే బుక్ అయ్యాయి. దీనితో చైతూ క్రేజీ రికార్డ్ సెట్ చేసాడు అని చెప్పాలి. ఇక నేడు శనివారం బుకింగ్స్ కూడ చైతూ సినిమాకి సాలిడ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ చైతు కెరీర్లో హైయెస్ట్ నెంబర్స్ ఈ సినిమాకి నమోదు అవుతున్నాయి. ఇక ఫైనల్ గా తండేల్ లెక్కలు ఎక్కడ అగుతాయో చూడాల్సిందే.

Exit mobile version