యాక్షన్ హీరో గోపీచంద్ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సీటీమార్. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుండగా గోపీచంద్ కబడ్డీ కోచ్ పాత్ర చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టైటిల్ తో పాటు, గోపి చంద్ లుక్ విడుదల చేశారు. స్పోర్ట్స్ ట్రాక్ ధరించి మెడలో విజిల్ తో ఉన్న గోపీచంద్ లుక్ వైవిధ్యంగా ఉంది. గత చిత్రాలకు భిన్నంగా గోపి చంద్ మొదటిసారి స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా ఆమె కూడా లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. నేడు సీటీమార్ చిత్రం నుండి ఆమె లుక్ విడుదల చేశారు. ఇక తమన్నా ఈ చిత్రంలో జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్ గా చేస్తున్నారు. ఆమ్ రోల్ కూడా ఈ చిత్రంలో సీరియస్ నెస్ తో కూడుకున్న ఇంటెన్సిటీతో ఉంటుందని అర్థం అవుతుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.