నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్ నటిస్తున్న చిత్రంలో ప్రత్యేక కవ్వాలి సాంగ్ ఉండబోతుంది. ఈ మధ్యనే ఈ పాటను సంగీత దర్శకుడు స్వరపరచగా రామ జోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. కవ్వాలి అనేది సూఫీ సంగీతంలో ఒక రకము, ఈ రకమయిన పాటలకు నుస్రత్ అలీ ఫతే ఖాన్ బాగా ప్రసిది. హైదరాబాద్ లో ఇది బాగా ప్రచారంలో ఉన్నా ఈ రకమయిన పాటలను తెలుగు చిత్రాలలో వాడటం చాలా అరుదు తమన్ ఈ చిత్రం కోసం ఇలాంటి పాటను చెయ్యడం సంతోషకరమయిన విషయం. ఈ చిత్రంలో సిద్దార్థ్ సరసన సమంత నటిస్తుంది. ఈ చిత్ర బృందం రాబోయే వారంలో కొన్ని సన్నివేశాలు మరియు ఒక పాటను చిత్రీకరించడానికి దుబాయ్ పయనమవనున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.