చేతి నిండా చిత్రాలతో ఉన్న తమన్


గత కొన్ని నెలలుగా తమన్ వార్తల్లో లేరు కానీ తన రాబోయే చిత్రాల కోసం రోజంతా కష్టపడుతున్నారు. ఆయన చేస్తున్న చాలా చిత్రాలు డిసెంబర్ నుండి విడుదల కానున్నాయి. ఈ లిస్టులో సిద్దార్థ్ – సమంతలు నటిస్తున్న చిత్రం, “నాయక్”, “లవ్ స్టొరీ”, “బాద్షా” మరియు “షాడో”లు ఉన్నాయి. ఆయన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అభిమానులతో చిత్ర విశేషాలను పంచుకుంటూ ఉన్నారు. ” బాద్షా లో మూడు పాటలు పూర్తయ్యాయి ఇంకా రెండు పాటలను ఈ నెలలో పూర్తి చేస్తాను ఒకటి అక్టోబర్లో పూర్తి చేసి ఆడియోని డిసెంబర్ లో విడుదల చేయ్యనున్నాం ” అని చెప్పారు . ఇవే కాకుండా రవితేజ రాబోతున్న చిత్రం “బలుపు” మరియు రాధా మోహన్ “గౌరవం” చిత్రానికి కూడా తమన్ సంగీతం సమ కూర్చనున్నారు. చూస్తుంటే 2013 తమన్ కి మరియు అతని అభిమానులకు హుషారయిన సంవత్సరం కానుంది అనిపిస్తుంది.

Exit mobile version