‘అఖండ 2’ కి థమన్ గ్రౌండ్ వర్క్ అదుర్స్!

నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ అలానే హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక సంగీత దర్శకుడు థమన్ కూడా మంచి డెడికేషన్ తో ఎక్కడా తగ్గకుండా సినిమా చేస్తున్నాడు.

ఇలా సంగీతం సాహిత్యం పరంగా ఎక్కడా తగ్గకుండా దైవత్వాన్ని పాట రూపంలో డిజైన్ చేస్తున్నాడు. మరి ఇలానే ఇటీవల మిశ్రా సోదరులని సంస్కృత సాహిత్యం కోసం తీసుకోగా ఇప్పుడు ప్రముఖ క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్ తో వర్క్ చేస్తున్నట్టు రివీల్ చేశాడం దీనితో అఖండ 2 డివోషనల్ పరంగా అద్భుతమైన సాహిత్యం దుమ్ము లేచిపోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. పార్ట్ 1 లోనే ఎక్సలెంట్ లిరిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version