ఇండస్ట్రీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సంగీత సారధ్యంలో రానున్న సినిమా ‘నాయక్’. ఈ మూవీ టీజర్ గురించి చెప్పాలని తమన్ ఫుల్ జోష్ మీదున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మొదటి సారి చేస్తున్న తమన్ ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ‘ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నేను ఇంకా నాయక టీజర్ పై పని చేస్తున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తాము. ఇంత సూపర్బ్ టీజర్ ఇచ్చినందుకు వినాయక్ గారికి థాంక్స్ మరియు చోటా కె నాయుడు విజువల్స్ చాలా బాగున్నాయని’ తమన్ ట్వీట్ చేసాడు.
చరణ్ ‘మగధీర’, ‘రచ్చ’ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్స్ రీమేక్ చేసాడు. ఆ సినిమాలు హిట్ కావడంతో అదే సెంటిమెంట్ ని ఈ సినిమాలో కూడా ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘శుభలేక రాసుకున్నా’ పాటని ‘నాయక్’ లో రీమిక్స్ చేసారు. చరణ్ సరసన కాజల్ మరియు అమలా పాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి వి.వి వినాయక్ డైరెక్టర్.