అజిత్ కి ఏమయ్యింది.. తన షాకింగ్ లుక్ వైరల్!

అజిత్ కి ఏమయ్యింది.. తన షాకింగ్ లుక్ వైరల్!

Published on Jun 24, 2025 11:50 PM IST

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాదిలోనే రెండు రిలీజ్ లతో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందించారు. పట్టుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే రెండు సినిమాలతో అలరించిన అజిత్ ఈ సినిమాల తర్వాత తన ఫ్యాషన్ రేసింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే అజిత్ ని ఎంతో స్టైలిష్ అండ్ డైనమిక్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో చూసిన ఫ్యాన్స్ కి అలాగే ఆడియెన్స్ కి తన లేటెస్ట్ లుక్ షాకింగ్ గా మారింది అని చెప్పాలి. ఇందులో అజిత్ చాలా వీక్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు.

దానికి తోడు తన హెయిర్ స్టైల్ కూడా చూస్తుంటే ఫ్యాన్స్ కే ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అజిత్ కి కేవలం 54 ఏళ్ళు వయస్సే కానీ తన ఏజ్ తనకంటే ఎక్కువ ఏజ్ ఉన్న హీరోల తరహాలో కూడా తాను కనిపించకపోగా ఇంకా ఎక్కువ ఏజ్ లా కనిపించడం అనేది ఒకింత షాకింగ్ అని చెప్పాలి. ఫిట్నెస్ పరంగా అజిత్ ఇప్పుడు మంచి లుక్స్ తో కనిపించేవారు కానీ ఇప్పుడు ఈ తరహా లుక్ లో కనిపించడం అనేది ఫ్యాన్స్ లో కూడా కొంచెం కలవరం పెట్టేలా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు