హీరో ఉదయ్ కిరణ్ మరణం టాలీవుడ్ లోని ఇండస్ట్రీ ప్రముఖులను కలచి వేసింది. ఈ రోజు తన అభిమానులు, ఇండస్ట్రీలోని వారు చూడటానికి మృత దేహాన్ని ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. చాలా మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఉదయ్ కిరణ్ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.
డా. దాసరి నారాయణరావు, అల్లరినరేష్ , సునీల్, శ్రీ కాంత్, జయసుధ, పరుచూరి బ్రదర్స్, అనిల్ సుంకర, వరుణ్ సందేశ్, ఆదిశేషగిరి రావు, సుదీర్ బాబు, ప్రిన్స్, సురేష్ కొండేటి తదితరులు వచ్చారు. ఉదయ్ కిరణ్ దహన క్రియలు ఎర్రగడ్డ స్మశాన వాటికలో జరగనున్నాయి.