ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే మోడీకి అర్బన్ ఏరియాల నుండి, బిజినెస్ కమ్యూనిటీల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. బిజెపి పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ కి వచ్చారు. దాంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలామంది ఆయన్ని కలుసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ, డా. మోహన్ బాబు, కె. రాఘవేంద్రరావు, డా. మురళీ మోహన్, కృష్ణం రాజు, బూరుగుపల్లి శివరామకృష్ణ, దిల్ రాజు, మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీ మంచు, ఎవీస్ మొదలైన కొంతమంది మోడీని కలుసుకున్నారు. బాలకృష్ణ ఈ సందర్భంలో త్వరలో జరగనున్న తన చిన్న కూతురు వివాహ మహోత్సవానికి మోడీని ఆహ్వానించారు.