సచిన్ కు వీడ్కోలు చెప్పిన టాలీవుడ్

సచిన్ కు వీడ్కోలు చెప్పిన టాలీవుడ్

Published on Nov 14, 2013 8:37 AM IST

sachin-tendulkar
గత 24 సంవత్సరాలు గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ రోజు సచిన్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వున్నా క్రికెట్ అభిమానులు ఎంతో ఎమోషనల్ కు గురవుతు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ప్రముఖులు కూడా సచిన్ గురించి వారి ఫీలింగ్స్ గురించి వివరించారు. ” నేను సచిన్ ను మిస్ అవుతున్నాను. నేను సచిన్ కోసమే మ్యాచ్ చూసిన సందర్బాలు చాలా ఉన్నాయి. నేను మసాలా సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాను. అందుకే నేను సచిన్ మ్యాచ్ ను చూడటానికి వెళ్ళలేకపోతున్నాను ” అని వెంకటేష్ అన్నాడు.
” క్రికెట్ లో సచిన్ చాలా గొప్పవాడని నా అభిప్రాయం” అని రామ్. ‘సచిన్ లేని క్రికెట్ ని నేను ఊహించుకోలేను.’ అని అల్లరి నరేష్ అన్నాడు. ‘సినిమాలలో ఎన్ టి ఆర్ ఎలాగో, క్రికెట్ లో సచిన్ కూడా అలాగా. ఇప్పటి నుండి అందరు సచిన్ క్రికెట్ ఆడటానికి ముందు, సచిన్ వెళ్ళిన తరువాత క్రికెట్ అంటారని’ మంచు మనోజ్ అన్నాడు. ‘నేను సచిన్ నుండి రిటైర్ కాను’ అని బీవీఎస్ రవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

తాజా వార్తలు