సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తెలుసు కదా’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తెలుసు కదా’ !

Published on Oct 12, 2025 1:00 PM IST

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబర్ 17, 2025న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలకు రెడీగా ఉంది. ఈలోగా, ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ పొందిందని మేకర్స్ తెలిపారు. రన్‌ టైమ్ మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.

దీనికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

తాజా వార్తలు