‘తెలుసు కదా’ ఓటీటీ రిలీజ్ డేట్ అదే !

‘తెలుసు కదా’ ఓటీటీ రిలీజ్ డేట్ అదే !

Published on Nov 9, 2025 1:04 PM IST


స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రీసెంట్ మూవీ ‘తెలుసు కదా’. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారు అయింది. ఈ రొమాంటిక్ డ్రామా తెలుగు వెర్షన్ నవంబర్ 14, 2025న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఐతే, ఇతర భాషా వెర్షన్‌లు తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేయగా.. ఈ సినిమాలోని కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేశారు. దీపావళి పండుగ బరిలో ఇతర సినిమాలతో పోటీగా ఈ చిత్రం రావడం కొంతవరకు ఈ సినిమాకు ఎఫెక్ట్ అయింది. దీంతో,ఈ సినిమా టోటల్ రన్‌లో మిగతా చిత్రాలతో వెనుకబడింది. మొత్తానికి థియేటర్స్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి.

తాజా వార్తలు