సామ్ తో గట్టి ఎంటర్టైన్మెంట్ నే ప్లాన్ చేసిన “ఆహా”.!

సామ్ తో గట్టి ఎంటర్టైన్మెంట్ నే ప్లాన్ చేసిన “ఆహా”.!

Published on Nov 6, 2020 11:11 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలు మన దేశంలో కూడా పాగా వేసాయి. అలాగే మన తెలుగు ఆడియెన్స్ లోకి కూడా చొచ్చుకొచ్చిన ఆ స్ట్రీమింగ్ యాప్స్ కు ధీటుగా నిబడిన మొట్ట మొదటి మన తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ “ఆహా”. టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ యాప్ అమితమైన ప్రేక్షాదరణతో దూసుకెళ్తుంది.

పక్కా తెలుగు ఎంటర్టైన్మెంట్ తో అలాగే సరికొత్త సినిమాలు మరియు వెబ్ కంటెంట్ తో ఈ ఓటిటి యాప్ అలరిస్తోంది. అయితే ఈ యాప్ లో గత కొన్ని రోజుల నుంచి ఒక అప్డేట్ ను వీరు టీజ్ చేస్తూ వస్తున్నారు. ఒక సరికొత్త షో ను ఊహించని అతిధి హోస్ట్ చేస్తారని వారి ఎంటర్టైన్మెంట్ తో “ఆహా” అనిపించడానికి రెడీగా ఉన్నారని హింట్ ఇస్తూ వచ్చారు. అయితే అది స్టార్ హీరోయిన్ సమంతానే అని అంతా అనుకున్నారు.

ఇపుడు ఆ ఊహలను నిజం చేస్తూ సామ్ నే హోస్ట్ గా పెట్టి “సామ్ జామ్ సమంత” అనే ఒక బిగ్గెస్ట్ సెలెబ్రెటీ టాక్ షో ను ప్లాన్ చేసారు. అలాగే ఈ షోతో గట్టి ఎంటర్టైన్మెంట్ ను కూడా లాక్ చేసేసారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల నుంచి తమన్నా, రష్మికాల వరకు ఎపిసోడ్స్ ను సామ్ తో ప్లాన్ చేసి ఈ నవంబర్ 13 నుంచి ప్రీమియర్స్ తో పలకరించడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ సరికొత్త ఎంటర్టైనింగ్ షో ఎలా ఉంటుందో సామ్ దానిని ఎలా హోస్ట్ చేసారో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు