చిరు ఫ్యాన్స్ ను క్షమాపణ కోరిన “ఆహా”.!

చిరు ఫ్యాన్స్ ను క్షమాపణ కోరిన “ఆహా”.!

Published on Dec 31, 2020 1:00 PM IST

ఈ మధ్య కాలంలో ఓటిటి హవా ఎలా పెరిగిందో చూస్తూనే ఉన్నాము. అంతర్జాతీయంగా పాపులర్ కాబడిన ఓటిటి యాప్స్ చాలానే ఉన్నాయి. మరి వాటికి ఏమాత్రం తగ్గకుండానే మన తెలుగు నుంచి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నుంచి వచ్చిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా”.

మంచి తెలుగు వెబ్ కంటెంట్ తో దూసుకుపోతున్న ఈ యాప్ పట్ల ఇటీవలే మెగాస్టార్ చిరు అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనిపై ఆరా తీస్తే ఈ షోలో స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేనితో ప్లాన్ చేసిన ఓ బిగ్ సెలెబ్రెటీ షో “సామ్ జామ్”లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. మరి ఈ ఎపిసోడ్ ప్రోమోకు ఒకదానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని పడాల్సింది మెగాస్టార్ అల్లు అర్జున్ అని పడింది.

దీనితో ఈ ట్యాగ్ విషయంలో చిరు అభిమానులు ఆహా యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. దీనితో ఆహా వారు ఈ ప్రాబ్లమ్ ను గుర్తించి సరి చేసారు. అలాగే ఇది ఒక ఎర్రర్ వలనే జరిగింది అని అందుకు తమ క్షమాపణ తెలియజేస్తున్నామని అసలైన మెగాస్టార్ ఎవరో చెప్పక్కర్లేదు కదా అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

తాజా వార్తలు