గత ఏడాది వచ్చిన కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కోలుకోని పరిశ్రమ ఏదన్నా ఉంది అంటే అది సినీ పరిశ్రమే అని చెప్పాలి. అందులో కీలక భాగం అయినటివంటి థియేటర్ సంస్థ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. కానీ మెల్లమెల్లగా పరిస్థితులు మారడంతో మళ్ళీ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి కొత్త సినిమాలు తెర మీద పడ్డాయి ప్రేక్షకుల అడుగులు థియేటర్స్ లోకి వచ్చాయి.
మరి ఇప్పుడు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే థియేటర్లులోకి అనుమతులు మాస్కులు తప్పనిసరిగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే అనుమతులు ఉంటాయని తేల్చేసారు. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతున్నందున పెద్ద సినిమాలు కూడా విడుదలకు వస్తున్న నేపథ్యంలో తమిళ నాట పలు చిత్రాలకు పూర్తి ఆక్యుపెన్సీను ప్రభుత్వం ఇచ్చింది.
దీనితో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాణ మండలి కీలక సబ్గ్యులు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అదే విధంగా 50 నుంచి 100 శాతం ప్రేక్షకులు సినిమా చూసేలా అనుమతులు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసారు. ఈ మండలి ప్రెసిడెంట్ ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, వైస్ ప్రెసిండెంట్స్ వై వి ఎస్ చౌదరి..
అలాగే అశోక్ కుమార్ మరియు ఇతర సెక్రటరీలు ఈ ప్రెస్ నోట్ ద్వారా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సహాయాన్ని మరవలేమని మరి అదే విధంగా థియేటర్స్ కు 50 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ పెంచాలని కోరారు. మరి దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం వెల్లడి చేస్తారో చూడాలి.