కన్నడ సినిమా నుంచి అవైటెడ్ గా వచ్చిన లేటెస్ట్ చిత్రమే “కాంతార 1”. దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ డివోషనల్ యాక్షన్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా దుమ్ము లేపుతుంది. అయితే ఈ సినిమాకి గతంలో కూడా మన తెలుగు ఆడియెన్స్ కన్నడ వసూళ్లకు మించి ఓపెనింగ్స్ అందించారు. మరి మళ్ళీ సరిగ్గా ఇదే రిపీట్ అవుతుంది.
యూఎస్ మార్కెట్ లో తెలుగు భాషలో వసూళ్లే కన్నడని బీట్ చేసి మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. 1 మిలియన్ గ్రాస్ వసూలు అయితే అందులో 60 శాతానికి పైగా తెలుగు వసూళ్లే కంట్రిబ్యూట్ చేస్తే మిగతా 40 లో కన్నడ, హిందీ సహా ఇతర భాషలు కలిపి ఉన్నాయి. అనే ఈ లెక్కన మన తెలుగు వసూళ్లు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీశ్ లోకనాథ్ సంగీతం అందించగా రుక్మిణి వసంత్ సాలిడ్ రోల్ లో నటించింది.