ఏంటి పూజా ఇంత మాట అనేశావ్.. షాకవుతున్న ఫ్యాన్స్

ఏంటి పూజా ఇంత మాట అనేశావ్.. షాకవుతున్న ఫ్యాన్స్

Published on Nov 7, 2020 1:03 AM IST

తెలుగు ఇండస్ట్రీలోని స్టార హీరోయినాల్లో పూజ హెగ్డే కూడ ఒకరు. 2014లోనే ఆమె ఇండస్ట్రీకి వచ్చినా గత రెండు మూడేళ్లల్లోనే స్టార హీరోయిన్ అయింది. గత రెండేళ్లు ఆమెను ఆదరించినట్టు మరే హీరోయిన్ నూ ఆదరించలేదు తెలుగు ప్రేక్షకులు. భారీ సినిమాలు చేసే దర్శకులు సైతం పూజాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు. ‘అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో’ లాంటి హిట్ చిత్రాలతో ఆమె స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్టార్ స్టేటస్ మాత్రమే కాదు పారితోషకం కూడ పెద్ద మొత్తానికి చేరుకుంది. నిర్మాతలు కూడ ఆమెకు డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

దీనికంతటికీ కారణం ఆమె మీద ప్రేక్షకుల చూపిస్తున్న ఇష్టమే. పూజా సినిమాలో ఉందంటే సినీ లవర్స్ తెగ సంతోషిస్తున్నారు. అందుకే ఆమె ప్రజెంట్ డిమాండ్లో ఉంది. ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’లో కనిపించనుంది. ఇంకా కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. అంతగా తెలుగు ప్రేక్షకులు ఆమెను అభిమానిస్తుంటే పూజా మాత్రం ఒకే ఒక్క కామెంట్ చేసి వారి ఆగ్రహానికి గురైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తెలుగు పరిశ్రమను, ప్రేక్షకులను పొగుడుతూనే సౌత్ ఇండియ‌న్ సినిమా వాళ్లు న‌డుము మ‌త్తులోనే ఉంటార‌ని, మిడ్ డ్రెస్‌ల‌లో తమని చూడాల‌నుకుంటార‌ని అనేసింది.

అదే కొందరిని హార్ట్ చేసింది. సినిమాలంటే గ్లామర్ కూడ ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే అంశాల్లో అది కూడ ఒకటి. కానీ అంతమాత్రానికే ప్రేక్షకులు కేవలం తన గ్లామర్ చూడటానికే ఇష్టపడుతున్నారన్నట్టు మాట్లాడటం భావ్యం కాదని కౌంటర్లు వేస్తున్నారు. హిందీలో ఫ్లాప్ అయితే తెలుగు పరిశ్రమ ఆదరించింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ అందించింది. కోట్లాది రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకెళ్లింది. అలాంటి ప్రేక్షకుల మీద ఇలాంటి కామెంట్స్ చేస్తారా అంటూ నొచ్చుకుంటున్నారు. మొత్తానికి పూజా ఆ మాటలను ఏ ఉద్దేశ్యంతో అన్నదో కానీ అవి కాస్త మిస్ ఫైర్ అయ్యాయి.

తాజా వార్తలు