మన టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జ నుంచి హను మాన్ లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ అదే తరహా నేపథ్యంలో వస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రమే “మిరాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా దీనిపై కూడా మంచి బజ్ ఉంది. అయితే షూటింగ్ కి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ అందరికీ షాకిచ్చింది.
ఇక నేడు అవైటెడ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసేసారు. మరి ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పవచ్చు. మన ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి కానీ కంటెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా కావాల్సిన ప్రామిసింగ్ విజువల్స్ మెయిన్ గా ఇవి గ్రాఫిక్స్ అని తెలిసిపోయేవే ఎక్కువ కనిపిస్తున్నాయి.
మరి వాటికి ఈ మిరాయ్ అతీతంగా ఉందని చెప్పడంలో సందేహమే లేదు. స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక హాలీవుడ్ సినిమాలానే మిరాయ్ కనిపిస్తుంది. మంచు మనోజ్ పై సాహస సన్నివేశాల్లో కానీ తేజ సజ్జపై సన్నివేశాల్లో కానీ ఎక్కడా కూడా మేకర్స్ అసలు కాంప్రమైజ్ అయ్యినట్టే కనిపించడం లేదు. అలాగే ఇండియన్ సినిమాకి ఒక సరికొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాగా ఇది అనిపిస్తుంది.
అలాగే పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ లెవెల్లో దుమ్ము లేపేలా ఈ టీజర్ కనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ లో మంచు మనోజ్ ఆశ్చర్యపరిస్తే తేజ సజ్జ హను మాన్ తర్వాత మరోసారి పెద్ద భాద్యతనే తనపై వేసుకున్నాడు. ఇక లాస్ట్ షాట్ లో రాముని రాకపై చూపించిన విజువల్ వర్ణనాతీతం.. మొత్తానికి మాత్రం మిరాయ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తమ బ్యానర్ లోనే ఒక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారని చెప్పొచ్చు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి