ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా

ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా

Published on Sep 11, 2025 12:09 PM IST

Mirai-0

తేజ సజ్జ హీరోగా యంగ్ హీరోయిన్ రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ కం విజువల్ ట్రీట్ చిత్రమే “మిరాయ్”. మొదటి నుంచీ మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకి గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. మరి ఈ గ్యాప్ లో మిరాయ్ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అదరగొడుతుంది.

అక్కడ సాలిడ్ బుకింగ్స్ తో మంచి ప్రీమియర్స్ నంబర్స్ ని అందుకొని రిలీజ్ కి ముందే 2 లక్షల డాలర్స్ మార్క్ అందుకొని అదరగొట్టింది. దీనితో మిరాయ్ సినిమా హవా గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటించగా మరిన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. అలాగే గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు