పెళ్లి చూపులు డైరెక్టర్ చివరికి సాధించాడట..!

పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు దర్శకుడు తరుణ్ భాస్కర్. కమర్షియల్ గా కంటెంట్ పరంగా సూపర్ సక్సెస్ అయిన ఆ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ మూవీ తరువాత ఈ నగరానికి ఏమైంది? అనే ఓ న్యూ ఏజ్ యూత్ఫుల్ మూవీ తీశారు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా కూడా తరుణ్ చేయడం జరిగింది.

ఐతే ఈ యంగ్ డైరెక్టర్ విక్టరీ వెంకటేష్ తో మూవీ చేస్తున్నట్లు ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఎంతకీ ఈ మూవీ పట్టాలెక్కని నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. ఐతే తాజాగా తరుణ్ భాస్కర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నానన్న ఆయన ఈ చిత్రం సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పుకొచ్చారు . ఇక వెంకటేష్ ప్రస్తుతం అసురన్ తెలుగు రీమేక్ నారప్ప సినిమాలో నటిస్తున్నారు.

Exit mobile version