మామూలుగా హీరోయిన్స్ గ్లామర్ మరియు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డైట్ ఫుడ్ అనేది భోజన ప్రియులకి కొంచెం కష్టమైనా విషయం అని చెప్పుకోవాలి. అలాంటి భోజన ప్రియులలో తన అందంతో కుర్రకారును మత్తెక్కిస్తున్న డిల్లీ భామ తాప్సీ కూడా ఒకరు. గుండెల్లో గోదారి సినిమా చిత్రీకరణ టైంలో జరిగిన విశేషాలను తెలియజేస్తూ ‘ ‘గుండెల్లో గోదారి’ చిత్రీకరణ సమయంలో గోదావరిలో మాకు పెట్టిన భోజనం ఎంత తినకూడదు అని ఆపుకోవాలనుకున్నా ఆపుకునే దాన్ని కాదు. ఎందుకంటే ఆ ఫుడ్ అంత రుచికరంగా ఉండేది. అక్కడ షూటింగ్ జరిగినన్ని రోజులు వారు చూపించిన ప్రేమ మరియు ఆ ఫుడ్ ఎప్పటికీ మరిచిపోలేను’ అని తన అనుభవాన్ని పంచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న తాప్సీ ఈ సంవత్సరం తను నటించిన ‘గుండెల్లో గోదారి’ మరియు వెంకటేష్ సరసన చేస్తున్న ‘షాడో’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుంది.