‘సరళ’గా కనిపించబోతున్న తాప్సీ


తాప్సీ త్వరలో ‘సరళ’ గా మనముందుకు రాబోతుంది. మంచు లక్ష్మి నిర్మిస్తున్న ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో సంప్రదాయమైన యువతిగా కనిపించబోతుంది. ఆమె పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పైన కనపడుతుంది.

ఈ చిత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. 1986 లో గోదావరి వరదల నేపధ్యంగా తెరకేక్కుతున్నట్లు సమాచారం. ఆది పినిశెట్టి, మంచు లక్ష్మి, సందీప్ కృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇలయరాజా సంగీతం అందిస్తుండగా కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో విడుదల చేయబోతున్నారు.

Exit mobile version