
పారితోషకం విషయంలో తెలుగు హీరొయిన్లు ఒక అడుగు ముందుంటారు ఒక సినిమా హిట్ కొట్టగానే వాళ్ల పారితోషకం ఆకాశాన్ని అంటుతుంది అని పరిశ్రమలో వినిపిస్తుంటుంది. కాని తను అలా కాదని అంటుంది తాప్సీ. “మిస్టర్ పర్ఫెక్ట్” చిత్రం విజయం సాదించాక ఈ నటి తన పారితోషకాన్ని అమాంతం పెంచినట్టు వార్తలు వినిపించాయి. దీనికి స్పందిస్తూ తాప్సీ ” నాకు ఇంత పారితోషకం ఇస్తేనే నటిస్తాను అని నేను ఎప్పుడు అనలేదు ఆ స్థాయికి నేను ఇంకా రాలేదు నా రెమ్యునరేషన్ దర్శకుడు డిసైడ్ చేస్తాడు. దాన్ని నిర్మాత ఫైనల్ చేస్తాడు. కావాలంటే.. నా నిర్మాతలను అడిగి తెలుసుకోవచ్చు అని అన్నారు. ఇలాంటి పుకార్ల మూలాన తన కెరీర్ కి సమస్య వస్తుంది అని దయచేసి ఇలాంటివి సృష్టించకండి అని కోరారు. ప్రస్తుతం తాప్సీ “షాడో” మరియు అల్లు అర్జున్ “ఇద్దరమ్మాయిలతో” చిత్రాలలో నటిస్తున్నారు.