తెలుగబ్బాయి విడుదలకు సిద్దం


తనీష్ , తషూ కౌశిక్ , రమ్య నంబీసన్ హీరో హీరోయిన్లుగా ఓ. ఎస్. అవినాష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తెలుగబ్బాయి . వేరా ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ పై నిర్మాత ఎస్ రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు . రోమెంటిక్ లవ్ స్టోరీగా రూపిందిన ఈ చిత్రం అన్ని హంగులతో ముస్తాబై విడుదలకు సిద్దమైంది. ఈ చిత్ర్రాన్ని ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఓ.ఎస్.అవినాష్ మాట్లాడుతూ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం పూర్తిగా మలేషియాలో చిత్రీకరణ జరుపుకుంది . మేం వయసుకు వచ్చాం మూవీ తరువాత తనీష్ నటించిన ఈ మూవీ తనీష్ కి మరో సక్సెస్ ఫుల్ మూవీ అవుతుంది. దర్శకుడిగా నాకు చాల మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది. తనీష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెలుగబ్బాయి చిత్రాన్ని రూపొందించాం . యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి అన్నారు.
హీరో తనీష్ మాట్లాడుతూ తెలుగబ్బాయి మూవీ నాకు నటుడిగా మరింత మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. ఈ మూవీ కాచితంగా తెలుగబ్బాయి మంచి సక్సెస్ సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది అన్నారు.

తనీష్, తషూ కౌశిక్ , రమ్య నంబీసన్, నాగబాబు, లోహిత్ , సోనా నాయర్ , అనన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేర ప్రతాప్ వి. కుమార్, ఎడిటింగ్ ఓ రవిశంకర్ , సంగీతం మేజ్జో జోసఫ్ , రీ రికార్డింగ్ ఎస్. వి ఈశ్వర్ , పాటలు జే.ఎస్. నివాస్, సమర్పణ ఎస్. కలైవాని, నిర్మాత ఎస్.రామకృష్ణ, రచన,దర్శకత్వం ఓ.ఎస్.అవినాష్

Exit mobile version