మెగాఫోన్ పట్టుకున్న తనికెళ్ళ


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి ప్రతిభ ఉన్న సీనియర్ నటులలో తనికెళ్ళ భరణి ఒకరు. ఆయన గతంలో ‘సిరా’, ‘కీ’ మరియు బ్లూ క్రాస్’ వంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఒక పూర్తిస్థాయి చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నారు. ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’ కథ ఆధారంగా అదే పేరుతో సినిమా చేయబోతున్నారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లాలోని వావిలవలస అనే గ్రామంలో మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియజేస్తారు.

Exit mobile version