స్వర్గస్తులైన తమ్మారెడ్డి భరద్వాజ్ తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి

Thammareddy-bharadwaj-fathe
ప్రముఖ నిర్మాత, డైరెక్టర్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ ని శోక సముద్రంలో ముంచిన రోజు ఈ రోజు. ఎందుకంటే ఆయన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఈ రోజు కన్ను మూశారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు సినిమా నిర్మాత అంతే కాకుండా అయన యుక్త వయస్సులో భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. అలాగే ఆయనికి 2007 లో రఘుపతి వెంకయ్య అవార్డు ని ఇచ్చి సత్కరించారు. ఆయన నిర్మాతగా ‘లక్షాదికారి’, ‘రోజులు మారాయి’, ‘పల్లెటూరు’ మొదలైన సినిమాలను నిర్మించాడు.

ప్రస్తుతం ఆయన్ని ప్రజలు అందరూ చూడాలనే ఉద్దేశంతో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి భౌతిక దేహాన్ని నాగార్జున సాగర్లోని తమ నివాసంలో ఉంచారు. ఈ రోజు సాయంత్రం సనత్ నగర్లోని స్మశాన వాటికలో కృష్ణమూర్తి గారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Exit mobile version