ఆన్ లైన్ గేమింగ్ వివాదం.. రానా, సుదీప్, తమన్నలకు నోటీసులు

ఆన్ లైన్ గేమింగ్ వివాదం.. రానా, సుదీప్, తమన్నలకు నోటీసులు

Published on Nov 4, 2020 2:36 AM IST

మన దేశంలో క్రికెట్, రమ్మీలకు ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ లైన్ బెట్టింగ్ అన్నమాట. ఈ యాప్స్ మీద అనేక ఆరోపణలు, అభ్యన్తరాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ గేమింగ్ ద్వారా చాలా మంది ఎంతో డబ్బును కోల్పోయారని, ఆర్థికంగా చితికి అప్పులపాలయ్యారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆన్ లైన్ రమ్మీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు నిషేధించడం జరిగింది.

తాజాగా ఒక న్యాయవాది ఈ ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ మీద మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలను జూదం పట్ల ప్రభావితం చేస్తున్న వీటి మీద తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు ధర్మాసనం ఈ ఆన్ లైన్ గేమింగ్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ త్వరలోనే చర్యలకు పూనుకుంటున్నారని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే వీటికి ప్రచారకర్తలుగా వ్యవహరించిన కోహ్లీ, గంగూలీ, తమన్నా, రానా, ప్రకాష్ రాజ్, సుదీప్ లాంటి స్టార్లకు సైతం వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. ఈ ఉదంతంతో ఇకపై సినీ తారాలెవరైనా ఆన్ లైన్ గేమింగ్ కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలంటే వెనకముందు ఆలోచించాల్సిందేనని స్పష్టమైంది.

తాజా వార్తలు