లోకేష్ పై తమిళ తంబీలు అసహనం?

Lokesh Kanagaraj

కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్ నుంచి రీసెంట్ గా ‘కూలీ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత లోకేష్ లైనప్ అగమ్యగోచరంగా మారింది. కూలీ తర్వాత వెంటనే కమల్ హాసన్, రజినీకాంత్ ల క్రేజీ మల్టీస్టారర్ తాను చేస్తాడని టాక్ వచ్చింది. కానీ అప్పటికే కూలీ ప్లేస్ లో చేయాల్సి ఉన్న ఖైదీ 2 పెండింగ్ లో ఉండిపోయింది.

సరే రజిని, కమల్ ల మల్టీస్టారర్ దర్శకుడు తాను కాదు అని తెలిసినప్పుడు ఖైదీ ఫ్యాన్స్, తమిళ ఆడియెన్స్ చాలామంది ఫైనల్ గా ఖైదీ 2 స్టార్ట్ అవుతుంది అని భావించారు. కానీ లేటెస్ట్ ట్విస్ట్ గా లోకేష్ లైనప్ లో మళ్ళీ ఖైదీ 2 వెనక్కి వెళుతుంది అనే రూమర్స్ తమిళ ఆడియెన్స్ కి మరోసారి అసహనం తెప్పిస్తున్నాయి.

ఎప్పుడో కంప్లీట్ చేయాల్సిన ఖైదీ 2 ముందు పూర్తి చేసుకుంటే బాగుంటుంది అని తన నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ ఆడియెన్స్ సోషల్ మీడియాలో కొత్త రూమర్స్ పట్ల తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తన సినిమాటిక్ యూనివర్స్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు వదిలేసి వేరే సినిమాలు చేస్తాడు అనే టాక్ కే వారు ఇప్పుడు ఇంతలా డిజప్పాయింట్ అవుతున్నారు. మరి వీటిని లోకేష్ కూడా దృష్టిలోకి తీసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే బెటర్ మరి.

Exit mobile version