దక్షిణాన సూపర్ హిట్ సినిమాలలో నటిచిన మిల్కీ బ్యూటి తమన్నా బాలీవుడ్ లో ‘ హిమ్మత్ వాలా’ సినిమాతో అడుగుపెట్టింది. కాని తమన్నా బ్యాడ్ లక్ ఈ సినిమాకి ప్రజల నుండి ఆశించినంత ఆదరణ లబించలేదు. తమన్నా చేసిన పాత్ర పై కూడా విమర్శలు వస్తున్నాయి. అప్పటి సినిమాలో నటించిన శ్రీ దేవీ అంత గ్లామర్ గా, పవర్ ఫుల్ గా తన పాత్ర లేదని అంటున్నారు. తమన్నా అక్షయ్ కుమార్ తో కలిసి మరో సినిమాలో నటించనుంది. ఈ సినిమా విజయాన్ని సాదిస్తుందని తను పూర్తి నమ్మకంతో ఉంది. అలాగే తెలుగులో నాగ చైతన్య హీరోగా రానున్న ‘తడాఖా’ లో తమన్నానటిస్తోంది. ఈ సమ్మర్ లో విడుదల కానుంది.